ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో ఎల్లుండి నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం

ABN, First Publish Date - 2021-08-02T22:24:45+05:30

తెలంగాణలో బుధవారం నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభమవుతాయని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభమవుతాయని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ప్రకటించారు. ఎంసెట్ నిర్వహణ కోసం అన్ని  ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎంసెట్‌కు మొత్తం విద్యార్థులు 2,51,132 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌ విద్యార్థులు 1,64,678 మంది, మెడికల్ ఎంట్రన్స్‌ రాస్తున్న విద్యార్థులు 86,454 మంది రాస్తున్నారని తెలిపారు. ఎంసెట్ కోసం తెలంగాణలో 82 సెంటర్లు, ఏపీలో 23 సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆగస్ట్ 4,5,6 తేదీలలో ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తామని గోవర్ధన్ చెప్పారు. ఆగస్ట్ 9,10 తేదీల్లో వ్యవసాయ, మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 నుంచి 12 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తామని తెలిపారు. రెండు గంటల ముందే పరీక్ష హాల్ లోకి విద్యార్థులను అనుమతిస్తామని, హాల్ టికెట్‌తో పాటు రూట్ మ్యాప్ కూడా విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు చేశామని గోవర్ధన్ పేర్కొన్నారు.

Updated Date - 2021-08-02T22:24:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising