ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2021-12-14T17:39:21+05:30

అభివృద్ధి పనుల శంకుస్థాపన వేదికగా టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలోనే దాడి చేసుకున్నాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి సమక్షంలోనే పిడిగుద్దులు 

హైదరాబాద్/ఎల్‌బీనగర్‌: అభివృద్ధి పనుల శంకుస్థాపన వేదికగా టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలోనే దాడి చేసుకున్నాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడమే ఈ ఘర్షణకు కారణమయ్యాయి. ఘర్షణలో బీజేపీ కార్యకర్త కిరణ్‌రాజ్‌కు గాయాలవడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం సరూర్‌నగర్‌ డివిజన్‌లోని భగత్‌సింగ్‌నగర్‌ ఫేజ్‌-2లో భూగర్భ డ్రైనేజీ ఆధునీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి సబితాఇంద్రారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభమవుతుండగా టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. ఒకరు జై తెలంగాణ అనగా మరొకరు భారత్‌మాతాకి జై అని, ఒకరు జై కేసీఆర్‌ అనగా మరొకరు జై నరేంద్రమోదీ అని పరస్పరం నినాదాలు చేశారు. దీంతో మంత్రి కలుగజేసుకుని నినాదాలు ఇవ్వొద్దని సూచించారు. అయినా నినాదాలు కొనసాగడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు వారిని వారిస్తున్నా పిడిగుద్దులతో ఆ ప్రాంతాన్ని రణరంగంగా మార్చారు. అతికష్టం మీద పోలీసులు ఇరువర్గాలను నిలువరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఇరువర్గాల వారు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-12-14T17:39:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising