ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

6 నెలల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN, First Publish Date - 2021-02-27T06:33:06+05:30

ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్‌ బ్రాడ్‌ గేజ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫలక్‌నుమా ప్రాంతంలో : సీపీ 

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 26 

(ఆంధ్రజ్యోతి) : ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్‌ బ్రాడ్‌ గేజ్‌ లైన్‌లో నిర్మించతలపెట్టిన రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మాణ పనుల కారణంగా ఫలక్‌నుమా పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ సీపీ అంజనీకుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షలు మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు 6 నెలల పాటు ఉంటాయని తెలిపారు. మహబూబ్‌నగర్‌ ఎక్స్‌ రోడ్‌ నుంచి ఇంజన్‌ బౌలి వైపు భారీ వాహనాలను అనుమతించరు. అదే విధంగా వాహనాలను చాంద్రాయణగుట్ట వైపు మళ్లిస్తారు. భారీ వాహనాలు బండ్లగూడ ఎక్స్‌రోడ్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఇంజన్‌బౌలి నుంచి మహబూబ్‌నగర్‌ ఎక్స్‌ రోడ్‌ వైపు వెళ్లే వాహనాలను షంషీర్‌గంజ్‌, ఆలియాబాద్‌ వైపు మళ్లిస్తారు. భారీ వాహనాలు షంషీర్‌గంజ్‌ వైపు నుంచి తాడ్‌బన్‌ ఎక్స్‌రోడ్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఆయా రూట్లలో ప్రయాణించే  వాహనదారులు ఈ ఆంక్షలను గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.


తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు..

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. వాట్సప్‌ గ్రూప్‌ అడ్మిన్‌లు సమాచారం పంపే సమయంలో అది నిజమా కాదా అని నిర్ధారించుకున్న తర్వాతే ఫార్వర్డ్‌ చేయాలని కోరారు. 

Updated Date - 2021-02-27T06:33:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising