ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ, కేసీఆర్‌ను బొందపెడితేనే దేశం, రాష్ట్రంలో శాంతి: Revanth

ABN, First Publish Date - 2021-10-11T19:28:48+05:30

యూపీలో బీజేపీ నేతలు రైతులను రాక్షసంగా చంపేశారని...దీనిపై మోడీ, అమిత్ షా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: యూపీలో బీజేపీ నేతలు రైతులను రాక్షసంగా చంపేశారని...దీనిపై మోడీ, అమిత్ షా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ సమస్య కాదు 80 శాతం మంది రైతుల సమస్య అని అన్నారు. 80 కోట్ల మంది రైతులను బానిసలుగా మార్చే కుట్ర చేశారని ఆరోపించారు. రైతుకు మరణ శాసనం రాసే చట్టాలు చేశారని..దీనిపై రైతులు తిరగబడి ఎర్రకోటపై జెండా ఎగరేశారని తెలిపారు. కేసీఆర్ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినట్లు చెప్పారని అయితే ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత కేసీఆర్‌కు చలిజ్వరం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు.


శాంతిభద్రతలు కాపాడాల్సిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కొడుకే రైతులను కారుతో తొక్కించి చంపారన్నారు. ఈ దాడిని ప్రపంచం మొత్తం ఖండిస్తుంటే మోడీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దేశ ప్రజల మన్ కీ బాత్ విను మోడీ అని హితవుపలికారు. సిరిసిల్లలో కూడా దళితులను ఇసుక లారీలతో గుద్ది చంపారని ఆరోపించారు. పాలకులే ప్రజలను భయపెట్టి, చంపి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు. రైతులను చంపిన వారిని నడిబజారులో ఉరి తీయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మోడీకి లొంగిపోయారని విమర్శించారు. మోదీ, కేసీఆర్‌ను బొందపెడితేనే దేశంలో రాష్ట్రంలో శాంతి ఉంటుందన్నారు. మోదీ, అమిత్ షా రైతుల హత్యలను ఖండించి జాతికి క్షమాపణ చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-10-11T19:28:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising