ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth: ఇందిరాపార్క్ నుంచి ధర్నాచౌక్‌కు

ABN, First Publish Date - 2021-07-16T17:00:26+05:30

పెరిగిన పెట్రోల్, డిజిల్ ధరలకు నిరసనగా రాజ్‌భవన్‌ ముట్టడికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పెరిగిన పెట్రోల్, డిజిల్ ధరలకు నిరసనగా రాజ్‌భవన్‌ ముట్టడికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ క్రమంలో కాసేపటి క్రితమే రేవంత్‌ రెడ్డి జూబ్లిహిల్స్‌లోని తన నివాసం నుంచి ఇందిరాపార్క్ దర్నా చౌక్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ సూచలనలతోనే కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ఆందోళనలను అడ్డుకుంటోందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తోన్న కొందరు అధికారులు మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. ఐజీ ప్రభాకరరావు ఖాసిం రిజ్వీ మాదిరి వ్యవహరిస్తున్నారన్నారు.


నిబంధనలకు వ్యతిరేకంగా ఇంటిలిజెన్స్ ఐజీ ప్రభాకరరావుకు  పోస్టింగ్  ఇచ్చారని ఆయన తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో ఐజీ ప్రభాకరరావుపై కేంద్ర హోంమంత్రికి  ఫిర్యాదు చేస్తానని చెప్పారు.కాంగ్రెస్, బీజేపీ నేతలు సహా‌ రాష్ట్రంలోని ముఖ్య నాయకల ఫోన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాక్ చూపిస్తోందని ఆరోపించారు. హ్యాకర్లను ఉపయోగిస్తూ అంతర్జాతీయ నేరానికి పాల్పడుతోన్న కేసీఆర్ భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించే వరకు కాంగ్రెస్ పోరాటం‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. చలో రాజ్‌భవన్‌కు ఖచ్చితంగా వెళ్ళి తీరుతామని రేవంత్‌ తెలిపారు. 

Updated Date - 2021-07-16T17:00:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising