ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తెలంగాణ శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్

ABN, First Publish Date - 2021-03-03T18:23:50+05:30

శాసనసభ స్పీకర్ శ్రీనివాస్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం ఉదయం నిమ్స్‌ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శాసనసభ స్పీకర్ శ్రీనివాస్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం ఉదయం నిమ్స్‌ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ సవత్సర కాలంగా దేశంలో, రాష్ట్రంలో కొత్త వ్యాధి కరోనా లక్షలాది మందికి సోకిందన్నారు. చైనా నుంచి అన్ని దేశాలకు విస్తరించిందని తెలిపారు. కరోనా వచ్చాక బాధ పడడం కంటే.. రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని చెప్పారు. భారత్ బయోటెక్ ప్రపంచంలో మంచి వ్యాక్సిన్‌ను అందించిందని తెలిపారు. కోవాక్సిన్‌ను తీసుకున్నానని...తీసుకుని 40 నిమిషాలు అయినా సేఫ్‌గా ఉన్నామని అన్నారు. ఇచ్చిన చోట నొప్పి కూడా లేదన్నారు. నిమ్స్ వైద్యులు నొప్పి లేకుండా వ్యాక్సిన్ ఇచ్చారని ఆయన తెలిపారు.  వ్యాక్సిన్ తీసుకున్నా ఏమి కాదని....తన వయసు 73 ఏళ్ళన్నారు. భారత్ బియోటెక్ సంస్థకు స్పీకర్ అభినందనలు తెలియజేశారు. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయారన్నారు. కోవాగ్జిన్ దేశానికే గర్వకారణమని తెలిపారు. రెండో డోస్ తీసుకున్నకాక.. యాంటీ బాడీ టెస్ట్ చేయించనున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-03T18:23:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising