ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దర్జీలు దర్జా బతుకు కోసం పోరాడాలి: శ్రీనివా్‌సగౌడ్‌

ABN, First Publish Date - 2021-03-01T07:08:29+05:30

దర్జీలు దర్జా బతుకు కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంగోపాల్‌పేట్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): దర్జీలు దర్జా బతుకు కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. టైలర్స్‌ డే సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి టైలర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉజ్జయినీ మహంకాళి దేవాలయం నుంచి నల్లగుట్ట కమ్యూనిటీహాల్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కుట్టుమిషన్‌ శాస్త్రవేత్త విలియం హో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పది లక్షల మంది మేరు కులస్థుల బతుకు మెరుగుపడేందుకు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులకు వర్తించే అన్ని రకాల వసతులు టైలర్స్‌కు వర్తింపచేయాలని, ప్రభుత్వం కుట్టించే యూనిఫార్మ్‌లు మేరు కులస్థులకు ఇవ్వాలన్నారు. అసెంబ్లీలో ఇప్పటి వరకు అడుగుపెట్టని మేరుకులస్థులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మేరు ఫెడరేషన్‌ అధ్యక్షులు లింబాద్రి వేణు, నాయకులు కర్నే రాజు, వెంకటస్వామి, ఎం. శ్రీనివాస్‌, జి.సురేష్‌, వేంపాటి పాండు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-01T07:08:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising