ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీధి వ్యాపారాలను పరిశీలించిన కేంద్ర బృందం

ABN, First Publish Date - 2021-01-19T07:21:02+05:30

కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంటసర్కిళ్ల పరిధిలో ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా పీఎం స్వనిధి ద్వారా రూ. 10 వేలు రుణం పొందిన వీధి వ్యాపారులను కేంద్ర బృందం సోమవారం కలిసింది.

నిజాంపేట్‌లో పట్టణ జీవనోపాధి కేంద్రాన్ని ప్రారంభిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుత్బుల్లాపూర్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంటసర్కిళ్ల పరిధిలో ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా పీఎం స్వనిధి ద్వారా రూ. 10 వేలు రుణం పొందిన వీధి వ్యాపారులను కేంద్ర బృందం సోమవారం కలిసింది. మినిస్ట్రీ ఆఫ్‌ హోం అఫైర్స్‌ జాయింట్‌ సెక్రటరీ సంజయ్‌కుమార్‌, సీడీఎంఏ డైరెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ పథకంపై వ్యాపారులకు ఏ మేరకు సమాచారం ఉందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీధి వ్యాపారాలను పరిశీలించి డిజిటల్‌ లావాదేవీలపై లబ్ధిదారులకు వివరించారు. కార్యక్రమంలో పీడీ సౌజన్య, జెడ్సీ మమత, డీసీలు రవీందర్‌కుమార్‌, మంగతాయారు, డీపీవోలు సంధ్య, హరిప్రియ, మెప్మా అధికారులు, డీఎంసీలు జయకృష్ణ, భాను, సీవోలు, ఆర్పీలు పాల్గొన్నారు. 

డిజిటల్‌ లావాదేవీలపై శిక్షణ

నిజాంపేట్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): నిజాంపేట్‌ కార్పొరేషన్‌ ప్రగతినగర్‌ మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్లో మేయర్‌ కొలన్‌ నీలా గోపాల్‌రెడ్డి అధ్యక్షతన వీధి వ్యాపారులకు డిజిటల్‌ లావాదేవీలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్‌ హోం అఫైర్స్‌ జాయింట్‌ సెక్రటరీ సంజయ్‌కుమార్‌, సీడీఎంఏ డైరెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ, అడిషనల్‌ కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌ పాల్గొన్నారు. అనంతరం 7, 28 డివిజన్‌ పరిధిలోని శ్రీనివా్‌సనగర్‌ పార్కు, అర్బన్‌ ఫారెస్ట్‌, పట్టణ జీవనోపాధి కేంద్రాన్ని ప్రారంభించారు.రాజీవ్‌గాంధీనగర్‌ మోడ్రన్‌ టాయిలెట్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ ధనరాజ్‌యాదవ్‌, కమిషనర్‌ గోపి, కార్పొరేటర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-19T07:21:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising