ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD : మద్యం డబ్బుల కోసం గొడవ.. తండ్రికి నిప్పు

ABN, First Publish Date - 2021-11-18T12:12:13+05:30

HYD : మద్యం డబ్బుల కోసం గొడవ.. తండ్రికి నిప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/రాయదుర్గం : తాగుడుకు బానిసై తండ్రితో గొడవపడి కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు ఓ ప్రబుద్ధుడు. గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలోని ఇందిరానగర్‌లో  బుధవారం  ఈ ఘటన వెలుగుచూసింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దుర్గారావు ఇందిరానగర్‌లో నివాసముంటున్నాడు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఇంటివద్దే ఉంటున్నాడు. అతడి పెద్దకుమారుడు నాగబాబు గచ్చిబౌలిలో తోటమాలి. జీతం తల్లికి ఇస్తుంటాడు. ఇటీవల తాగుడుకు బానిసై మద్యానికి డబ్బులు కావాలని తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. మంగళవారం డబ్బుల విషయమై తండ్రి దుర్గారావుకు, నాగబాబుకు గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కిరోసిన్‌ తండ్రిపై పోసి నిప్పటించాడు. తీవ్రగాయాలైన దుర్గారావును ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ మృతిచెందాడు. చిన్న కుమారుడు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-18T12:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising