HYD : ఓ ప్రముఖ హోటల్‌లో Veg Biryani పార్శిల్ తీసుకుని.. ఇంటికెళ్లి ఓపెన్ చేయగా.. షాకింగ్ ఘటన..
ABN, First Publish Date - 2021-10-29T14:44:16+05:30
HYD : ఓ ప్రముఖ హోటల్‌లో Veg Biryani పార్శిల్ తీసుకుని.. ఇంటికెళ్లి ఓపెన్ చేయగా.. షాకింగ్ ఘటన..
హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి : చిక్కడపల్లిలోని ఓ హోటల్‌లో వెజ్ బిర్యానీలో బొద్దింక రావడం కలకలం రేపింది. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడిచేసి హోటల్ యాజమాన్యానికి రూ.5వేల జరిమానా విధించారు. చిక్కడపల్లిలోని ఓ హోటల్‌లో శివరామప్రసాద్ బిర్యాని పార్శిల్ ఆర్డర్ చేసి తీసుకువెళ్ళా డు. ఇంటికి వెళ్లి చూసేసరికి అందులో బొద్దింక కనపడింది. వెంటనే సదరు వ్యక్తి జీహెచ్‌ఎంసీ సహాయ ఆరోగ్య అధికారి డా. మైత్రేయికి, చిక్కడపల్లి పోలీసుల కు ఫిర్యాదు చేశారు. డా.మైత్రేయి ఆదేశం మేరకు జీహెచ్‌ఎంసీ సి బ్బంది హోటల్‌ను తనిఖీ చేశారు. పరిశుభ్రతను పాటించకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.5వేలను జరిమానాగా విధించారు.
Updated Date - 2021-10-29T14:44:16+05:30 IST