ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD : ప్రేమ పేరుతో సినీ ఆర్టిస్ట్‌పై లైంగిక దాడి.. గర్భం దాల్చడంతో..!

ABN, First Publish Date - 2021-07-12T14:36:57+05:30

ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పెళ్లి చేసుకోమన్నందుకు చిత్ర హింసలు


హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి, పెళ్లి చేసుకొవడానికి నిరాకరించిన యువకుడిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ శ్రీకాకుళం జిల్లా నుంచి సినీ అవకాశాల కోసం ఓ యువతి నగరానికి వచ్చింది. ఓ సినిమాలో నటిస్తోంది. ప్రకాశం జిల్లా ఉయ్యాల వాడ మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన మలపాటి రామకృష్ణ నగరంలోని రహ్మత్‌నగర్‌లో నివాసముంటున్నాడు.


అతను కూడా సినిమా ఆర్టిస్టే. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొద్ది కాలం తరువాత ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని నమ్మించి రామకృష్ణ ఆమెను తన గదికి తీసుకుళ్లి, పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్‌ చేయించాడు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో ఆమెను రామకృష్ణ హింసించడం మొదలు పెట్టాడు. ఆమెపై తప్పుడు ప్రచారం చేయడంతోపటు పలుమార్లు దాడి చేశాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామకృష్ణపై ఐపీసీ 376(2)(ఎన్‌), 452, 312, 417, 509 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-12T14:36:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising