ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad లో రెచ్చిపోతున్న దొంగలు.. ఒక్క వారంలోనే...

ABN, First Publish Date - 2021-07-13T16:54:52+05:30

తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్‌ చేసుకుంటూ చోరీలకు పాల్పడుతుండటంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వారంలో మూడు చోట్ల చోరీలు


హైదరాబాద్ సిటీ/జవహర్‌నగర్‌ : జవహర్‌నగర్‌ పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారంలో మూడుకు పైగా చోరీ కేసులు నమోదయ్యాయి. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్‌ చేసుకుంటూ చోరీలకు పాల్పడుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మిగడ్డ పరిధి నెహ్రూనగర్‌లో నివాసముంటున్న పోనోజు నవీన్‌చారి ఈ నెల 10న కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగట్టకు వెళ్లాడు. 11న ఉదయం ఇంటికి రాగా, తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా, బెడ్‌రూంలో మూడున్నర తులాల బంగారు ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లినట్లు అర్థమైంది. అదే కాలనీకి చెందిన గంగాధర్‌, నగేశ్‌, కుమార్‌, స్వామి, కంచగట్ల మల్లేశ్‌ల ఇళ్లలో కూడా చోరీలు జరిగాయని ఫిర్యాదులు అందాయి. కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ మధుకుమార్‌ తెలిపారు.  


దమ్మాయిగూడలో.. 

దమ్మాయిగూడా సాయిబాబానగర్‌లో నివాసం ఉంటున్న బసుదేవ్‌ సాహు  ఈ నెల 10న పనిమీద టౌలీ చౌక్‌కు వెళ్లాడు. తిరిగివచ్చి చూడగా, ఇంటి తాళాలు పగుల గొట్టి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా, బంగారు గొలుసు, ఉంగరాలు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-07-13T16:54:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising