ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణ వివరాలు పంచుకోవొద్దు

ABN, First Publish Date - 2021-01-14T06:54:29+05:30

సంక్రాంతి పండగకు సొంత ఊర్లకు వెళ్లేవారు తమ ప్రయాణ వివరాలను సోషల్‌మీడియాలో పంచుకోవద్దని సీపీ అంజనీకుమార్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌
హైదరాబాద్‌ సిటీ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి):
సంక్రాంతి పండగకు సొంత ఊర్లకు వెళ్లేవారు తమ ప్రయాణ వివరాలను సోషల్‌మీడియాలో పంచుకోవద్దని సీపీ అంజనీకుమార్‌ సూచించారు. ఇలా చేయడంవల్ల ఇంట్లో ఎవరూ లేరని దొంగలకు తెలిస్తే, దొంగతనానికి ఇదే మంచి అవకాశంగా మార్చుకుంటారని హెచ్చ రించారు.  పండగ సమయంలో రాత్రి పూట గస్తీ పెంచామని, బ్లూకో ల్ట్స్‌, పెట్రోలింగ్‌ వాహనాలు, సిబ్బంది ఎక్కువ మంది అందుబాటులో ఉంటారని తెలిపారు. పండగలకు ఊళ్లకు వెళ్లేవారు తమ కాలనీ అసోసియేషన్లు, పోలీస్టేషన్‌లలో సమాచారమివ్వాలని కోరారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ీనేను సైతం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కెమెరాలు పనిచేస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆ కెమరాల విజువల్స్‌ను నిల్వచేసే స్టోరేజ్‌ ఉపకరణాలు పనిచేయడం లేదని ఇటీవల గుర్తించామన్నారు.  కెమెరాల స్టోరేజ్‌ ఉపకరణాలు పనిచేస్తున్నాయా లేదా అని తరచు గమనించాలని కోరారు. కెమెరాల ఏర్పాటు, నిర్వహణకు సంబంధించి సమస్యలు ఉంటే సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Updated Date - 2021-01-14T06:54:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising