ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిందూపురంలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

ABN, First Publish Date - 2021-05-18T20:10:02+05:30

కరోనా బారిన పడిన ఫ్రంట్‌లైన్ వారియర్స్ పారిశుధ్ద్య కార్మికులు రోడ్డెక్కారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం జిల్లా: కరోనా బారిన పడిన ఫ్రంట్‌లైన్ వారియర్స్ పారిశుధ్ద్య కార్మికులు రోడ్డెక్కారు. సరైన వైద్యం అందించడంలేదంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లా, హిందూపురంలో పారశుధ్ద్య కార్మికులు  భయం గుప్పిట్లో జీవనం గడుపుతున్నారు. కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరితే.. అక్కడ సరైన వైద్యం అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిరశిస్తూ అంబేద్కర్ కూడలిలో పారిశద్ద్య కార్మికులు రోడ్డుపై బైఠాయించారు.


ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు.. కరోనా బారిన పడిన ఇద్దరు కార్మికులకు హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్య సేవలు అందించడం లేదని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో రోడ్డుమీదకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని పారిశుద్ధ్య కార్మికులు వాపోయారు. ఇప్పటికే కోవిడ్ బారిన పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారని, మరో ఇద్దరు కార్మికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిపట్ల వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆందోళనతో అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న కార్మికులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. దీంతో కార్మికులు శాంతించారు.

Updated Date - 2021-05-18T20:10:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising