ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈనెల 30న శ్రీ లలితావిద్య గ్రంథావిష్కరణ

ABN, First Publish Date - 2021-10-26T03:58:13+05:30

హైదరాబాద్: ఋషిపీఠం ఆధ్వర్యంలో అక్టోబర్ 30న కింగ్‌కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో 'శ్రీ లలితావిద్య' ఆవిష్కరణోత్సవం జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఋషిపీఠం ఆధ్వర్యంలో అక్టోబర్ 30న కింగ్‌కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో 'శ్రీ లలితావిద్య' ఆవిష్కరణోత్సవం జరగనుంది. సాయంత్రం ఆరు గంటలకు నాట్యగురువులు నూతి లక్ష్మిప్రసూన బృందంచే 'వన్ దే శ్రీమాతరం' పేరుతో ప్రత్యేక 'శివపద' నృత్యంతో కార్యక్రమం ప్రారంభం కానుంది.  'భాగవతవిరించి' డా. టి.వి. నారాయణరావు సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. కాంచీపురం కంచికామకోటిపీఠం శ్రీకార్యం ఏజెంట్, చల్లా విశ్వనాథశాస్త్రి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు. 'మధురభారతి' మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గ్రంథ సమీక్ష చేస్తారు. 'జ్ఞానానందనాథ' గోటేటి శ్రీనివాసరావు ప్రథమప్రతిని స్వీకరిస్తారు. గ్రంథకర్త సామవేదం షణ్ముఖశర్మ హృదయావిష్కారం చేస్తారు. శ్రీలలితసహస్రనామస్తోత్రంపై సామవేదం షణ్ముఖశర్మ ప్రవచనాలను ఒక గ్రంథంగా శ్రీ లలితావిద్య రూపొందించారు. 

Updated Date - 2021-10-26T03:58:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising