ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్యాంక్‌ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. యువకుడి దుర్మరణం

ABN, First Publish Date - 2021-06-28T11:49:24+05:30

ట్యాంక్‌బండ్‌పై ఆగి ఉన్న రెడీమిక్స్‌ వాహనాన్ని వేగంగా వచ్చి ఢీ కొన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/కవాడిగూడ : ట్యాంక్‌బండ్‌పై ఆగి ఉన్న రెడీమిక్స్‌ వాహనాన్ని వేగంగా వచ్చి ఢీ కొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం వేకువజామున ట్యాంక్‌బండ్‌పై గుర్రం జాషువా విగ్రహం వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కవాడిగూడ లోయర్‌ ట్యాంక్‌బండ్‌ మోతీలాల్‌ నెహ్రూనగర్‌కు చెందిన శ్రీకాంత్‌(24) డీజే ఆపరేటర్‌. శనివారం రాత్రి పురానాపూల్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొని తన హోండా డియో (టీఎస్09ఈఎఫ్‌ 7959)పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. ట్యాంక్‌బండ్‌ గుర్రం జాషువా విగ్రహం వద్ద రెడీమిక్స్‌ వాహనం(ఎంహెచ్‌46ఎఫ్‌3357) పార్క్‌ చేసి ఉంది. 


శ్రీకాంత్‌ ఆ వాహనం వెనుక భాగంలో ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గాంధీనగర్‌ పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ట్యాంక్‌బండ్‌పై చేపట్టిన అభివృద్ధి పనులలో భాగంగా కాంట్రా క్టర్‌ రెడీమిక్స్‌ వాహనాన్ని ఎలాంటి జాగ్రత్తలు లేకుండా పార్క్‌ చేశాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్‌ తల్లి భారతీ గాంధీ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  రెడీమిక్స్‌ డ్రైవర్‌ దేవ్‌సింగ్‌పై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ శ్రావణ్‌ తెలిపారు. 

Updated Date - 2021-06-28T11:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising