ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉప్పొంగిన జాతీయ స్ఫూర్తి

ABN, First Publish Date - 2021-01-27T06:36:04+05:30

గణతంత్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనువిందుగా భారతమాత మహా హారతి

ఖైరతాబాద్‌ జనవరి 26 (ఆంధ్రజ్యోతి): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని  భారతమాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత మాత మహాహారతి కార్యక్రమం కనువిందు చేసింది. లేజర్‌షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గాయని మధుప్రియ దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. దశావతారాలను తెలుపుతూ చేసిన నృత్యరూపకం, రామమందిర నిర్మాణ విశేషాలను తెలిపే అంశం, తమసోమా జ్యోతిర్గమయ అంటూ ప్రదర్శించిన నృత్యరూపకం అందరినీ అలరించాయి. నిలువెత్తు భారతమాత విగ్రహం ఎదుట భారతమాతతో పాటు వీర సైనికులు, గోమాత, గంగా మాత, సైనికులను స్మరిస్తూ సప్త హారతులను చూడముచ్చటగా ఇచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో జరిగింది. ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తి, ప్రముఖ అవధాని మాడుగుల నాగఫణి శర్మ, శ్రీ పీఠం నిర్వాహకులు స్వామి పరిపూర్ణానంద, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా నేత డాక్టర్‌ లక్ష్మణ్‌, ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, చింతల రామచంద్రారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, మోత్కుపల్లి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-27T06:36:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising