ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రామకృష్ణ మఠం’ ఆన్‌లైన్ యోగా తరగతులు

ABN, First Publish Date - 2021-01-02T22:04:40+05:30

నగరంలోని దోమలగూడలో ఉన్న రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ యోగా తరగతులను ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని దోమలగూడలో ఉన్న రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ యోగా తరగతులను ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేసింది. నిపుణులతో ఏర్పాటు చేసిన ఈ తరగతులు జనవరి 4 నుంచి 30 వరకు నాలుగు వారాల పాటు జరగనున్నాయి. వివిధ యోగాసనాలు, సూర్యనమస్కారాలు తదితరాలలో శిక్షణ ఇవ్వనున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు జరిగే ఈ తరగతులు ఉదయం 6.35 గంటలకు మొదలై 7.45 గంటల వరకు ముగియనున్నాయి. 16 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వారు మాత్రమే అర్హులు. 


ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు.  మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు. 


రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.

Updated Date - 2021-01-02T22:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising