ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు మహాగర్జన సభ వాయిదా

ABN, First Publish Date - 2021-04-22T06:25:20+05:30

ఓసీ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 23న కరీంనగర్‌లో నిర్వహించనున్న రైతు మహాగర్జన సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జైపాల్‌రెడ్డి, సలహాదారులు పెండ్యాల కేశవరెడ్డి, ఉపాధ్యక్షుడు చెన్నమనేని పురుషోత్తమరావు వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్కత్‌పుర, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఓసీ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 23న కరీంనగర్‌లో నిర్వహించనున్న రైతు మహాగర్జన సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జైపాల్‌రెడ్డి, సలహాదారులు పెండ్యాల కేశవరెడ్డి, ఉపాధ్యక్షుడు చెన్నమనేని పురుషోత్తమరావు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ నేతలు, వివిధ విపక్షాల సూచన మేరకు రైతు మహాగర్జన సభను వాయిదా వేసినట్లు వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు సవరణ చేసే వరకూ తమ పోరాటం ఆగదని అన్నారు. విద్యుత్‌ నియంత్రణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, రైతులకు మద్దతు ధర కల్పిస్తూ ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. రైతు ఉద్యమానికి తమ సంఘం ఎప్పుడూ అండగా ఉంటుందని వారన్నారు. 



Updated Date - 2021-04-22T06:25:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising