ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Be Careful : ఈ QR Codeను మూడుసార్లు స్కాన్ చేసినందుకు.. రూ. 89,999 హుష్..!

ABN, First Publish Date - 2021-11-24T17:03:35+05:30

ఇల్లు అద్దెకు తీసుకుంటానని, అడ్వాన్స్‌ చెల్లిస్తానని నమ్మించిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఇల్లు అద్దెకు తీసుకుంటానని మోసం


హైదరాబాద్ సిటీ/బోయిన్‌పల్లి : ఇల్లు అద్దెకు తీసుకుంటానని, అడ్వాన్స్‌ చెల్లిస్తానని నమ్మించిన ఓ వ్యక్తి క్యూఆర్‌ కోడ్‌ పంపించి ఇంటి యజమాని ఖాతా నుంచి డబ్బు డ్రా చేశాడు. బోయిన్‌పల్లి సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్‌ బోయిన్‌పల్లి ఆర్‌ఆర్‌నగర్‌ నాగిరెడ్డి కాలనీకి చెందిన ఎంఈఎస్‌ మాధవ్‌(49) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. నాచారంలో ఓ అపార్ట్‌మెంట్‌లో తనకు ఉన్న ఫ్లాట్‌ను రూ. 15 వేలకు అద్దెకు ఇస్తానని సెప్టెంబర్‌ 17న 99ఏసీఆర్‌ఎస్‌ డాట్‌ కామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ మరుసటిరోజు మాధవ్‌కు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు.


తన పేరు సచిన్‌ శర్మ అని, ఆర్మీలో పుణెలో పనిచేస్తున్నానని, హైదరాబాద్‌ బదిలీ అయిందని చెప్పాడు. ఫ్లాట్‌ అద్దెకు తీసుకుంటానని, రెండు నెలల అడ్వాన్స్‌ రూ. 30 వేలు బ్యాంక్‌ ఖాతాలో జమచేస్తానని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన మాధవ్‌ మోసగాడు పంపించిన క్యూర్‌ కోడ్‌లను మూడుసార్లు స్కాన్‌ చేశాడు. దశలవారీగా అతడి బ్యాంక్‌ ఖాతా నుంచి రూ. 89,999 డ్రా అయ్యాయి. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-11-24T17:03:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising