ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

29న Hyderabadకు రాష్ట్రపతి కోవింద్..

ABN, First Publish Date - 2021-12-22T13:16:28+05:30

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 29న సికింద్రాబాద్‌ రాష్ట్రపతి నిలయానికి రానున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/అల్వాల్‌ : శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 29న సికింద్రాబాద్‌ రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. జనవరి 3 వరకు ఆయన ఇక్కడ బస చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కంటోన్మెంట్‌ బోర్డు అధికారులు పారిశుధ్యంపై దృష్టి సారించారు. రాజీవ్‌రాహదారికి ఇరువైపులా చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. ఆయా ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు.


అన్ని సౌకర్యాలూ కల్పించండి..

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విడిది సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. ప్రొటోకాల్‌ ప్రకారం కల్పించాల్సిన సదుపాయాలపై సీఎస్‌ మంగళవారం బీఆర్కే భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి నిలయంలో 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో రహదారులు-భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికా్‌సరాజ్‌, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా, ఫైర్‌ సర్వీసెస్‌ డీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌, అడిషనల్‌ డీజీ జితేందర్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-22T13:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising