HYD: దళిత బంధు కంటే భూమి ముఖ్యం : గద్దర్
ABN, First Publish Date - 2021-09-29T16:52:20+05:30
సమాజంలో అట్టడుగున ఉన్న దళితుల అభివృద్ధికి భారత రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ పాలకులు తమకేం పట్టదన్నట్లు వ్యవహరించడం సబబు కాదని ద్రవిడ బహుజన
హైదరాబాద్/కృష్ణానగర్: సమాజంలో అట్టడుగున ఉన్న దళితుల అభివృద్ధికి భారత రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ పాలకులు తమకేం పట్టదన్నట్లు వ్యవహరించడం సబబు కాదని ద్రవిడ బహుజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ అన్నారు. ఆయన అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో ప్రజాగాయకుడు గద్దర్ మాట్లాడారు. దళితులకు దళిత బంధు కంటే మూడెకరాల భూమి ఎంతో ముఖ్యమన్నారు. దళిత కుటుంబానికి భూమి ఉంటే కుటుంబానికి మొత్తం పని ఉంటుందన్నారు. దళిత వాడలకు అధికారం అందాలంటే పంచాయతీలుగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. హుజూరాబాద్‌లోని కందుగుల గ్రామాన్ని ఇటీవలే పంచాయతీ చేసిన విధంగానే రాష్ట్రంలో ఉన్న దళితవాడలను పంచాయతీలుగా చేసి దళితుల అబివృద్ధికి కట్టుబడి ఉండాలన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ మైదాన ప్రాంతాల్లో 10 వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ప్రతి గ్రామానికీ ఒక దళితవాడ ఉంటుందన్నారు. దళితవాడలకు రాజకీయ అధికారం లేకుండా అభివృద్ధి కావన్నారు. దళితవాడలను పంచాయతీలుగా చేయాలనే డిమాండ్‌తో ఈనెల 30న ఇందిరాపార్కు వద్ద జరిగే సభకు దళితులు హాజరు కావాలన్నారు.
Updated Date - 2021-09-29T16:52:20+05:30 IST