ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు

ABN, First Publish Date - 2021-03-16T14:02:37+05:30

ఇంటి నుంచి ఆడుకోడానికి వెళ్లిన బాలుడు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/జవహర్‌నగర్‌ : ఇంటి నుంచి ఆడుకోడానికి వెళ్లిన బాలుడు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 9న ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. రెండు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇన్‌చార్జి సీఐ మధుకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వికలాంగుల కాలనీలో నివాసముం టున్న ఎర్రోళ్ల వేణుగోపాల్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుతూరు కలిసే ఉంటున్నారు. చిన్న కుమారుడు సిద్ధార్థ్‌(9) రచన గ్రామర్‌ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. సిద్ధార్థ్‌ కనిపించకపోవడంతో ఈ నెల 9న తండ్రి వేణు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


అదే రోజు బాలుడి కదలికలను సీసీ ఫుటేజీలలో పరిశీలిస్తుండగా సాయత్రం ఒక ఫుటేజీలో కనిపించాడని, దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లకు బాలుడి ఫొటో పంపిస్తున్నామని తెలిపారు. కౌకూర్‌ పరిధిలోని అడవిలో పోలీసులు, స్థానికులతో కలసి పరిశీలించనున్నట్టు చెప్పారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే జవహర్‌నగర్‌ సీఐ 83339 93275 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Updated Date - 2021-03-16T14:02:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising