ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD : ‘పట్టణ ప్రగతి’ అంటే పోజులిచ్చి ఫొటోలు దిగడమేనా..!

ABN, First Publish Date - 2021-07-11T18:24:14+05:30

పారిశుధ్య నిర్వహణ మెరుగుదల, పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, నీటి నిల్వలు, రహదారుల పక్కన వ్యర్థాల తొలగింపు లక్ష్యంగా....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పబ్లిసిటీ స్టంట్‌లా మారిన వైనం
  • ఆశించిన ఫలితాలు ఇవ్వని కార్యక్రమం
  • కొంతమంది ప్రజాప్రతినిధుల్లో కనిపించని చిత్తశుద్ధి
  • మమ అనిపించి.. ముచ్చటగా ముగించి
  • పలు ప్రాంతాల్లో చెత్త కుప్పలు అలానే
  • నీటి నిల్వల తొలగింపు అంతంత మాత్రమే
  • మరింత విజృంభిస్తున్న దోమలు
  • సొంత కార్యాలయం చక్కబెట్టుకోలేని జీహెచ్‌ఎంసీ
  • భవనం చుట్టూ ఫర్నిచర్‌, నిర్మాణ రంగ వ్యర్థాలు
  • లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా

హైదరాబాద్‌ సిటీ : పారిశుధ్య నిర్వహణ మెరుగుదల, పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, నీటి నిల్వలు, రహదారుల పక్కన వ్యర్థాల తొలగింపు లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. పది రోజులపాటు నిర్వహించిన  కార్యక్రమంలో ఏం జరిగింది, గ్రేటర్‌ పరిశుభ్రంగా మారిందా..?, నీటి నిల్వలు తొలగి దోమల వృద్ధి ఆగిందా..? అంటే లేదన్నదే సమాధానం. ప్రగతి కోసం ప్రభు త్వం ప్రకటించిన కార్యక్రమాన్ని కొందరు ప్రజాప్రతినిధులు పబ్లిసిట్‌ స్టంట్‌గా మార్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చామా, ఫొటో దిగామా, వెళ్లామా.. అన్నట్టుగా వ్యవహరించడంతో కార్యక్రమ ఉద్దేశం నెరవేరలేదు. చాలామంది స్థానిక ప్రజాప్రతినిధులు పరిశుభ్రతపై దృష్టిసారించలేదు. 


వ్యర్థల తొలగింపు కంటే ఫొటోలకు పోజులిచ్చేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఎక్కడి చెత్త అక్కడే, దోమల బెడద అలానే, దుర్గంధం ఎప్పటిలానే అన్నట్టుగా పరిస్థితి ఉంది. కార్యక్రమం కోసం 950 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని జీహెచ్‌ఎంసీ గొప్పలు చెప్పినా, ఆ టీంలు ఎక్కడ పని చేశాయో, ఏం చేశాయో అధికారులు చెప్పే పరిస్థితి లేదు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ మంది మార్భలంతో ఉదయం ఒక చోట, మధ్యాహ్నం మరో చోట అన్నట్టుగా కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తంగా పట్టణ ప్రగతిని గ్రేటర్‌లో మమ అనిపించారు.


చిత్తశుద్ధి ఏది..?

జులై 1న గ్రేటర్‌లో పట్టణ ప్రగతి ప్రారంభమైంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లు, వివిధ పార్టీల నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పది రోజులుగా రోజుకో చోట కార్యక్రమం చేపట్టి రోడ్లు ఊడవడం, మొక్కలు నాటడం, దోమల మందు పిచికారీ వంటివి చేశారు. ఎక్కడికక్కడ పట్టణ ప్రగతి నిర్వహించిన నేపథ్యంలో డివిజన్లలోని మెజార్టీ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగవ్వాలి. రోడ్ల పక్కన వ్యర్థాలు కనిపించకూడదు. కానీ గతంలోలానే  రహదారులపై చెత్తా చెదారం కనిపిస్తోంది.


అందులో రెండు, మూడేళ్ల క్రితం కొనుగోలు చేసిన కుర్చీలు, టేబుళ్లూ ఉన్నాయి. వాస్తవంగా వాటిని వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ, భవనం మెయింటెనెన్స్‌ అధికారులకు ఆ విషయం పట్టడం లేదు. మనదేం పోతుంది.. ప్రజాధనంతోనే కదా కొత్తవి కొనేది అనుకుంటున్నారేమో. ఎంత విలువైన పనులు చేస్తే, అంత ప్రయోజనమనుకునే అధికారులు. కనీసం పాత ఫర్నిచర్‌ను వేలం వేయవచ్చన్న విషయాన్ని మర్చిపోవడం గమనార్హం. తద్వారా ఎంతో కొంత ఆదాయం వచ్చే అవకాశం లేకపోలేదు. ఆధునికీకరణలో భాగంగా వెలువడిన నిర్మాణ రంగ వ్యర్థాలూ అక్కడే కుప్పగా దర్శనమిస్తున్నాయి. దీంతో పక్కనే ఉన్న నాలా నుంచి పాములు, ఇతర క్రిమి కీటకాలు వస్తున్నాయని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ముందు కార్యాలయ ప్రాంగణం పరిశుభ్రతపై దృష్టి పెడితే బాగుంటుందని అక్కడికి వచ్చే పౌరులు అభిప్రాయపడుతున్నారు.


ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమం మంచిదే అయినా, క్షేత్ర స్థాయిలో మెజార్టీ ప్రజాప్రతినిధులు మనస్ఫూర్తిగా పని చేయకపోవడంతో పట్టణ ప్రగతి తూతూ మంత్రంగా  కొనసాగింది. ఎక్కడికక్కడ కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో అపరిశుభ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తే బాగుండేది. కార్పొరేటర్లు ఈ విషయంలో మరింత చొరవతో పని చేసి ఉండాల్సింది. కానీ, అధిక శాతం కార్పొరేటర్లు పట్టణ ప్రగతిని ఫొటోలు దిగే కార్యక్రమంగానే భావించారు. ఎక్కడా పట్టుమని పది నిమిషాలు వారు పని చేసిన దాఖలాలు లేవు. ప్రజాప్రతినిధుల ఫొటో స్టంట్‌ ముగిసిన అనంతరం, ఎప్పటి లానే పారిశుధ్య కార్మికులు, జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేశామని చెబుతోన్న ప్రత్యేక బృందాల కార్మికులు వ్యర్థాలు తొలగించారు. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వ్యర్థాల తరలింపునకు పట్టుబట్టి మరీ అద్దె వాహనాలు ఏర్పాటు చేసుకున్నారు. సర్కిళ్ల వారీగా రెండు నుంచి నాలుగు వాహనాలు అందుబాటులో ఉంచగా, ఎన్ని వ్యర్థాలు తొలగించారన్న దానిపై స్పష్టత లేదు. నగరంలో ఖాళీ స్థలాలు ఎక్కువగా లేని నేపథ్యంలో మొక్కలు నాటడమూ అంతంత మాత్రంగానే సాగింది.


సొంత కార్యాలయంలో చెత్త కుప్పలు...

మహానగర రూపు రేఖలు మారుస్తామంటూ బయల్దేరిన జీహెచ్‌ఎంసీ సొంత కార్యాలయాన్ని చక్కబెట్టుకోలేకపోతోంది. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని ప్రధాన కార్యాలయం చుట్టూ ఫర్నిచర్‌, నిర్మాణ రంగ వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోయాయి. రెండున్నర దశాబ్దాల క్రితం నిర్మించిన భవనంలో అధికారుల ఛాంబర్ల ఆధునికీకరణ పనులు కొన్నాళ్లుగా కొనసాగుతున్నాయి. ఛాంబర్లకు అదనపు హంగులు అద్దడంతోపాటు.. కొత్త ఫర్నిచర్‌ కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అంతకుముందున్న ఫర్నిచర్‌ను కార్యాలయంలోని ఓ వైపున్న స్థలంలో కుప్పగా వేశారు. దాదాపు రెండు మీటర్ల ఎత్తు, 100 మీటర్ల పొడవునా కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు, గ్రిల్స్‌ వంటివి పేరుకు పోయాయి. యేడాదిగా అక్కడే ఉన్న ఫర్నిచర్‌ ఎండకు ఎండుతూ, వానకు తడుస్తోంది. 

Updated Date - 2021-07-11T18:24:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising