పరికి చెరువు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లో కూల్చివేతలు
ABN, First Publish Date - 2021-05-21T07:16:55+05:30
గాజులరామారం సర్కిల్ పరిధిలోని పరికి చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు రెండో రోజూ కొనసాగాయి.
షిర్డీహిల్స్‌లో అక్రమ షెడ్లను తొలగిస్తున్న దృశ్యం
కుత్బుల్లాపూర్, మే 20 (ఆంధ్రజ్యోతి): గాజులరామారం సర్కిల్ పరిధిలోని పరికి చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు రెండో రోజూ కొనసాగాయి. గురువారం పట్టణ ప్రణాళికా ఏసీపీ గణేష్ ఆధ్వర్యంలో మిగిలిన అక్రమ నిర్మాణాలు, సిమెంటు ఇటుకలు వాటి తయారీ యంత్రాలను తొలగించారు. సర్కిల్ పరిధిలోని షిర్డీహిల్స్‌లో అక్రమంగా నిర్మిస్తున్న షెడ్లను కూడా అధికారులు గురువారం కూల్చివేశారు. ఈ కూల్చివేతల్లో టీపీఎస్ సంగీత, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2021-05-21T07:16:55+05:30 IST