ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌ సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టు

ABN, First Publish Date - 2021-03-19T07:12:49+05:30

ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను నగరానికి తీసుకొచ్చి సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను నగరానికి తీసుకొచ్చి సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు. నిర్వాహకుడిని అరెస్టు చేసి, ఇద్దరు యువతులను రక్షించారు. యూసు్‌ఫగూడ కృష్ణానగర్‌ ప్రాంతానికి చెందిన వంశీకృష్ణ తన స్నేహితుడు సాయితో కలిసి సెక్స్‌ రాకెట్‌ నడిపిస్తున్నాడు. 

ఉద్యోగాల పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి యువతులను నగరానికి అక్రమంగా రవాణా చేసే ముఠాలతో వంశీకృష్ణకు సంబంధాలున్నాయి. వారి సహకారంతో యువతులతో నగరంలో సెక్స్‌రాకెట్‌ నడుపుతున్నాడు. తన వ్యాపారానికి ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌ లోకంటోను అడ్డాగా చేసుకున్నాడు. ఏ అమ్మాయి కావాలన్నా పంపుతామంటూ విటులను ఆకర్షించేవాడు. విటులు అమ్మాయిలను ఎంపిక చేసుకున్న తర్వాత ఆన్‌లైన్‌లో బేరం కుదుర్చుకునేవాడు. డబ్బులు ఆన్‌లైన్‌లో చెల్లించిన వారికి వారు కోరుకున్న అమ్మాయిని తన స్నేహితుడు సాయి సహకారంతో పంపేవాడు. కుషాయిగూడ ప్రాంతంలో ఆన్‌లైన్‌ సెక్స్‌ రాకెట్‌ నడుస్తున్నట్లు సమాచారం అందుకున్న మాల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు పథకం ప్రకారం.. ఆన్‌లైన్‌లోనే కస్టమర్‌లుగా నిర్వాహకులను నమ్మించి నిందితుల ఆటకట్టించారు. వారి చెర నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు యువతులను రక్షించారు. ప్రధాన నిర్వాహకుడు వంశీకృష్ణను అరెస్టు చేశారు. మరో నిందితుడు సాయి పరారీలో ఉన్నాడు.


Updated Date - 2021-03-19T07:12:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising