ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Omicron Virus: నాకు మాస్క్ అలవాటు లేదు.. హైదరాబాద్‌లో యువత వింత సమాధానాలు

ABN, First Publish Date - 2021-12-03T21:09:53+05:30

హైదరాబాద్: నగరంలో ప్రజలు మాస్కులపై నిర్లక్ష్యం వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో ప్రజలు మాస్కులపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒమైక్రాన్ ప్రమాదం పొంచి ఉన్నా.. అసలు లెక్క చేయడంలేదు. మాస్కు ఎందుకు పెట్టుకోవడం లేదని ప్రశ్నిస్తే వింతైన సమాధానాలు చెబుతున్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 30 దేశాల్లో ఇప్పటికే ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎవరైనా మాస్క్ పెట్టుకోకపోతే రూ. వెయ్యి ఫైన్ వేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయినా కొంతమంది మాస్కులు ధరించకుండా తిరుగుతుండడంతో ఏబీఎన్ వారిని ప్రశ్నించింది. సమాధానంగా ఓ వ్యక్తి ఏమన్నాడంటే.. మరిచిపోయి వచ్చానని చెప్పాడు. మరో యువకుడు అయితే మాస్క్ పెట్టుకోవడం అలవాటులేదని చెప్పాడు. మరొకరు అయితే జేబులో ఉందని.. ఇలా ఎవరికి తోచిన సమాధానాలు వారు చెబుతున్నారు. యువత ఇంకా ఎలాంటి వింత, విచిత్రమైన సమాధానాలు చెప్పారో తెలుసుకోవాలంటే వీడియో వీక్షించగలరు.

Updated Date - 2021-12-03T21:09:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising