ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sai Dharam Tej‌ యాక్సిడెంట్ విషయం ఫస్ట్ తెలిసింది బన్నీకే.. ఆయన వెంటనే..!

ABN, First Publish Date - 2021-09-13T12:59:08+05:30

సాయిధరమ్‌తేజ్‌కు రోడ్డు ప్రమాదం జరిగిన విషయం మొదట బన్నీ (అల్లుఅర్జున్‌)కే తెలిసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కుటుంబాన్ని అప్రమత్తం చేసిన బన్నీ
  • చిరంజీవికి ఫోన్‌ చేసి చెప్పిన అల్లుఅర్జున్‌
  • మెడికవర్‌లో పని చేస్తున్న స్నేహితుల ద్వారా సమాచారం
  • సాయిధరమ్‌ తేజ్‌కు సపర్యలు చేసిన ఫరాన్‌

హైదరాబాద్‌ సిటీ/ రాయదుర్గం : సాయిధరమ్‌తేజ్‌కు రోడ్డు ప్రమాదం జరిగిన విషయం మొదట బన్నీ (అల్లుఅర్జున్‌)కే తెలిసింది. తేజ్‌ను మొదట మెడికవర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అదే ఆస్పత్రిలో పని చేస్తున్న స్నేహితుల ద్వారా బన్నీకి సమాచారం అందింది. ఆ సమయంలో బన్నీ కాకినాడలో పుష్ప షూటింగ్‌లో ఉన్నాడు. విషయం తెలిసిన వెంటనే మామయ్య చిరంజీవి, అత్తయ్య సురేఖలకు ఇతర కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మెడికవర్‌లో ఉన్న స్నేహితుల ద్వారా ఎప్పటికప్పుడు సాయిధరమ్‌ ఆరోగ్యం గురించి బన్నీ వాకబు చేశారు.


అన్ని కోణాల్లోనూ దర్యాప్తు

సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదం కేసును సుమోటోగా స్వీకరించి రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. తేజ్‌పై ఐపీసీ 336, 279, మోటార్‌ వాహన చట్టం 184 కింద కేసు నమోదు చేశారు. ఆ రోజు రాత్రి సుమారు 8.20 గంటలకు ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు అబ్దుల్‌ ఫరాన్‌, ఆసీఫ్‌లను పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా బైక్‌ వేగాన్ని అంచనా వేస్తున్నామని పోలీసులు తెలిపారు.


ప్రమాద ఘటన జరిగిన ప్రాంతం నుంచి వెనక్కి వెళ్తూ, అతను బయల్ధేరిన ప్రాంతం వరకు ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాల్లో సాయిధరమ్‌తేజ్‌ బైక్‌పై వస్తున్న దృశ్యాలు నమోదయ్యాయో సేకరిస్తున్నట్లు సమాచారం. ఏ ప్రాంతంలో ఎంత స్పీడ్‌తో వెళ్లాలి, ఆయన ఎంత స్పీడ్‌తో వెళ్లారు అనే అంశాలపై టెక్నికల్‌ ఎవిడెన్స్‌ సేకరిస్తున్నట్లు సమాచారం. ప్రమాద స్థలంలో రోడ్డుపై ఇసుక ఉండటంతో టీఎస్ఐఐసి (ఐలా) అధికారులకు కూడా నోటీసులు ఇవ్వడానికి పోలీసులు కసరత్తు చేస్తున్నారు.




ఇవి కూడా చదవండి

24 గంటల తర్వాతే సర్జరీపై నిర్ణయంSai Dharam Tej ఇలా చేసుంటే సేఫ్‌గా బయటపడేవారేమో..!Sai Dharam Tej నడిపిన బైక్ రిజిస్టర్ అయ్యింది ఇతని పేరు మీదే..Mahesh koneru: తేజ్‌కి ప్రమాదం ఎలా జరిగిందంటే!శస్త్ర చికిత్స విజయవంతం

Updated Date - 2021-09-13T12:59:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising