ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD : న్యూయర్ పార్టీ కోసం Pubs, Restaurantsకు వెళ్తున్నారా.. అయితే ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి..!

ABN, First Publish Date - 2021-12-31T13:46:22+05:30

ప్రభుత్వం నయాసాల్‌ సంబరాలకు పచ్చజెండా ఊపడంతో పార్టీ ప్రియుల్లో జోష్‌ నెలకొంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సమయం మరవద్దు మిత్రమా..
  • పబ్‌లు, బార్‌లు, మద్యం షాపులకు పోలీసుల హుకుం
  • నయాసాల్‌ సందర్భంగా ఆదేశాలు

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : ప్రభుత్వం నయాసాల్‌ సంబరాలకు పచ్చజెండా ఊపడంతో పార్టీ ప్రియుల్లో జోష్‌ నెలకొంది. ఒమైక్రాన్‌ భయం నెలకొన్నా ఏదో రకంగా పార్టీ చేసుకోవాలని నగర వాసులు సిద్ధమవుతున్నారు. ఇక పబ్‌లు, రెస్టారెంట్‌లైతే పార్టీ ప్రియులను ఆకర్షించేందుకు అన్ని హంగామాలు చేస్తున్నాయి. ఈ ఉత్సాహం విషాదం కావద్దనేది అందరూ కోరుకుంటారు. మద్యం మత్తులో తప్పులో కాలేయడం యాదృచ్ఛికంగా జరిగిపోతుంటుంది. ఈ నయాసాల్‌ హుషారు ఎప్పటికీ గుర్తుండాలంటే నిబంధనలను పాటించి తీరాల్సిందేనని పోలీసులు హుకుం జారీ చేస్తున్నారు. పబ్‌లు, రెస్టారెంట్‌లు, కాఫీ సెంటర్‌లు, బార్‌లు, మద్యం షాపులు ఇలా ప్రతి ఒక్కరూ తమ సూచనలకు లోబడి నడుచుకోవాలని నిర్వాహకులకు నోటీసులు సైతం జారీ చేశారు. పబ్‌ యజమానులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. నిర్ణీత వేళలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో చోటుచేసుకున్న సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


నిర్వాహకులతో సమావేశం..

కాఫీ షాపులు, పబ్‌లు, బార్‌ల నిర్వాహకులతో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ పోలీసులు పలుసార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిబంధనలు ఎలా ఉంటాయి. వాటిని అధిగమిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అనే విషయాలపై అవగాహన కల్పించారు. తాజాగా గురువారం పశ్చిమ మండలం డీసీపీ కూడా పబ్‌ నిర్వాహకులతో సమావేశమయ్యారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు.. 

పబ్‌లు, బార్‌ల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. సమయం ప్రకారం మూసివేయకపోతే వెంటనే కేసులు నమోదు చేయడంతో పాటు నిర్వాహకులను అరెస్టు చేస్తాం. నిబంధనలపై ఇప్పటికే అవగాహన కల్పించాం. సూచనలు ఇచ్చాం.. పబ్‌లు ముగిసేంత వరకు సిబ్బంది అందరూ రోడ్ల మీదనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. - ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, సీఐ, జూబ్లీహిల్స్‌.


నిరంతరం నిఘా 

పబ్‌లు, బార్‌లపై నిరంతరం నిఘా పెడుతున్నాం. ఇప్పటికే నిబంధనలను పాటించాలని హెచ్చరించాం. ఎవరైనా ఉల్లంఘిస్తే పిటీ కేసు వేసి కోర్టులో హాజరుపరుస్తాం. ఒక్క నిమిషం లేటు అయినా కేసులు పెడతాం.. అర్ధరాత్రి దాటిన తరువాత తనిఖీలు చేస్తాం. - శివచంద్ర,  సీఐ బంజారాహిల్స్‌.

Updated Date - 2021-12-31T13:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising