ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేపచెట్లకు జీహెచ్‌ఎంసీ చికిత్స

ABN, First Publish Date - 2021-11-10T14:52:49+05:30

నగరంలో వేపచెట్లకు జీహెచ్‌ఎంసీ చికిత్స ప్రారంభించింది. పలు ప్రాంతాల్లో వేప చెట్లు ఎండిపోతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో సంస్థ తగిన చర్యలు చేపట్టింది. మీ ఏరియాలో వేప చెట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ: నగరంలో వేపచెట్లకు జీహెచ్‌ఎంసీ చికిత్స ప్రారంభించింది. పలు ప్రాంతాల్లో వేప చెట్లు ఎండిపోతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో సంస్థ తగిన చర్యలు చేపట్టింది. మీ ఏరియాలో వేప చెట్లు ఎండిపోతున్నాయా..? మాకు సమాచారమివ్వండని అధికారులు కోరుతున్నారు. ఫొమోప్సిస్‌ హజార్డిరాక్‌ అనే క్రిముల వల్ల వచ్చే ఫంగస్‌ డై బ్యాక్‌ వ్యాధి వల్లే చెట్లు ఎండిపోతున్నాయని చెబుతున్నారు.


ఈ నేపథ్యంలో చెట్లను కాపాడేందుకు అవసరమైన మందులను పిచికారి చేస్తున్నారు. ప్రొఫికొనాజోల్‌ ద్రావకం 20 మిల్లీ లీటర్లను 20 లీటర్ల నీటిలో కలిపి ఎండిపోతున్న చెట్టుపై సిబ్బంది స్ర్పే చేస్తున్నారు. కాగా ఎన్నో ఔషధ గుణాలున్న వేప చెట్లను కాపాడాలని కోరుతూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తన్నీరు రామ్మోహన్‌రావు మంగళవారం మానవ హక్కుల సంఘానికి వినతి పత్రం సమర్పించారు. టీ మస్కిటో బగ్‌ రాత్రి వేళల్లో వేప చెట్లపై చేరి రసం పీల్చడం వల్ల చెట్లు ఎండి పోతున్నాయని పేర్కొన్నారు.

Updated Date - 2021-11-10T14:52:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising