ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: ప్రమాదం అంచున ప్రయాణం

ABN, First Publish Date - 2021-09-17T16:33:33+05:30

నగర శివారు ప్రాంతాల్లోని రహదారులు ఆధ్వానంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండి అలుగుపోయడంతో వరద ప్రవాహానికి పలు ప్రాంతాలలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధ్వంసమైన మునగనూర్‌, హయత్‌నగర్‌ సరిహద్దు కల్వర్టు

పట్టించుకోని జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులు 


హైదరాబాద్/హయత్‌నగర్‌: నగర శివారు ప్రాంతాల్లోని రహదారులు ఆధ్వానంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండి అలుగుపోయడంతో వరద ప్రవాహానికి పలు ప్రాంతాలలో రోడ్లుకు ఇరువైపులా సగ భాగం కొట్టుకుపోయాయి. దాంతో వాహనదారుల రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మునగనూర్‌, హయత్‌నగర్‌ సరిహద్దు, బాతుల చెరువు రోడ్లు ఇందుకు నిదర్శనం.


ఇటీవల కురిసిన వర్షాలకు మునగనూర్‌.. హయత్‌నగర్‌ సరిహద్దు కల్వర్టు, రోడ్డు సగం వరకు వరద నీటి ప్రవాహాంలో కొట్టుకుపోయింది. దీంతో రోడ్డు కుంచించుకుపోయింది. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు ప్రమాదానికి నిలయంగా మారింది. ఇంజాపూర్‌, సాహెబ్‌నగర్‌ పై ప్రాంతాల నుంచి నేటికీ వరద నీరు వస్తోంది. కల్వర్టు కింద చిన్న సైజు పైపులు ఉండడంతో వరద నీరు సాఫీగా వెళ్లకుండా ఒకపక్క నిలిచి చెరువును తలపిస్తోంది. ప్రయాణికులు, వాహనదారులు ఏ మాత్రం ఏమరపాటుగా వెళ్లినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వరద నీటిలో గడ్డి, చెత్త మురిగిపోయి దుర్వాసన వస్తోంది. హయత్‌నగర్‌ శ్మశాన వాటికకు వచ్చే వారు, మునగనూర్‌ వైపునకు వెళ్లే వారు దుర్గంధంతో ఇబ్బందులు పడుతోన్నారు. ధ్వంసమైన రోడ్డుకు ఏలాంటి మరమ్మతులు చేయకుండా వదిలి వేశారు. కల్వర్టుకు ఇరువైపులా పిట్ట గోడలు కూడా లేక పోవడంతో రాత్రి వేళల్లో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు. ఆ రోడ్డుపై ఎదురెదురుగా రెండు వాహనాలు ఒకేసారి వెళ్లలేని పరిస్థితి ఉంది. 


తుర్కయంజాల్‌ మున్సిపాలిటీలోని కొహెడా, తొర్రూర్‌, మునగనూర్‌, బ్రాహ్మణపల్లి, నాగార్జునసాగర్‌ జాతీయ రహదారికి లింకు రోడ్డుగా ఉన్న ఈ రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రయాణం ప్రయాసంగా మారింది. సంఘీ, ఫిల్మ్‌ సిటీకి వెళ్లే వారు సైతం ఈ రోడ్డు మార్గాన్నే రాకపోకలు సాగిస్తోన్నారు. అను నిత్యం వేల సంఖ్యలో ప్రజలు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ఈ రోడ్డు గుండానే నగరానికి చేరుకుంటారు. హయత్‌నగర్‌ బాతుల చెరువు అలుగు వద్ద రోడ్డు నీటి కోతకు గురి అయింది. రోడ్డుకు ఇరువైపులా గుంతలు ఏర్పడ్డాయి. దాంతో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం అక్కడ ట్రాఫిక్‌ జాం ఏర్పడుతుంది. అధికారులు స్పందించి వర్షాలకు దెబ్బ తిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


కల్వర్టు వద్దకు రాగానే భయమేస్తుంది

మునగనూర్‌.. హయత్‌నగర్‌ సరిహద్దు కల్వర్టు వద్దకు రాగానే భయమేస్తుంది. రోడ్డుకు ఇరువైపులా వరద. ఎప్పుడు రోడ్డు కుంగుతుందోనన్న భయం. వేగంగా వచ్చే భారీ వాహనాలకు రోడ్డు కనిపించక ఎక్కడ నీటిలో పడతామోనని ఆందోళనగా ఉంది. వరదలో కొట్టుకు పోగా మిగిలిన సగం రోడ్డుపైనే ప్రయాణిస్తున్నాము. 

- నందకిషోర్‌, మునగనూర్‌   

Updated Date - 2021-09-17T16:33:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising