ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్నలిస్టుల కుటుంబాలకు రూ.25లక్షల ఆర్థిక సాయం చేయాలి: కోమటిరెడ్డి

ABN, First Publish Date - 2021-05-10T17:27:47+05:30

కరోనా బారిన పడి చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా బారిన పడి చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణాలో 100 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. చావు దుఃఖంలో ఉన్నా వారి కుటుంబానికి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల ఆర్ధిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. దేశం మొత్తంలో దాదాపు  పదిహేను రాష్ట్రాలలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించారని... వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం రాష్ట్ర ప్రభుత్వాలు చేయిస్తున్నాయని చెప్పారు.  కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం కూడా చేస్తున్నాయన్నారు. నిత్యం ప్రజల కోసం పని చేసే జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం కూడా తక్షణమే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి.. వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ప్రైవేట్ ఆసుపత్రులో ఉచిత వైద్యం చేయించాలని కోమటిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-10T17:27:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising