ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబ్బు పంపించాలని నకిలీ మెసేజ్‌

ABN, First Publish Date - 2021-04-17T06:53:46+05:30

చెల్లెలి ఫోన్‌ నంబర్‌ నుంచి వైద్య చికిత్స కోసం డబ్బు పంపించాలని మెసేజ్‌ రావడంతో అన్నయ్య ఆదుర్దాగా డబ్బు పంపించాడు. ఆ మెసేజ్‌ తాను పంపలేదని చెల్లెలు చెప్పడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగర వాసిని మోసం చేసిన కేటుగాళ్లు

ఖైరతాబాద్‌ ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): చెల్లెలి ఫోన్‌ నంబర్‌ నుంచి వైద్య చికిత్స కోసం డబ్బు పంపించాలని మెసేజ్‌ రావడంతో అన్నయ్య ఆదుర్దాగా డబ్బు పంపించాడు. ఆ మెసేజ్‌ తాను పంపలేదని చెల్లెలు చెప్పడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైఫాబాద్‌ డీఐ రాజు నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌ నివాసి అశోక్‌ చక్రవర్తి విశ్రాంత ఉద్యోగి. అతడి ఫోన్‌కు అమెరికా టెక్సాస్‌ నగరంలో ఉన్న తన చెల్లెలు సుజాత ఫోన్‌ నెంబర్‌ నుంచి తనకు రూ. 60 వేలు పంపాలని ఖాతా వివరాలతో మెసేజ్‌ వచ్చింది. వెంటనే రూ. 25 వేలు పంపించి చెల్లికి ఫోన్‌ చేయగా ఆమె లిఫ్ట్‌ చేయలేదు. ఇంటికి వచ్చి తన భార్య ఖాతా నుంచి మరో రూ. 25 వేలు పంపించి చెల్లికి ఫోన్‌ చేశాడు. ఆ సందేశం తాను పంపలేదని ఆమె చెప్పింది. గుర్తుతెలియని వ్యక్తులు తనను మోసం చేశారని గ్రహించిన అశోక్‌చక్రవర్తి సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-04-17T06:53:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising