ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పట్టా’భిషేకం

ABN, First Publish Date - 2021-03-21T06:40:41+05:30

హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో తొలిసారి గులాబీ జెండా ఎగిరింది.

వాణీదేవికి శాలువా కప్పుతున్న సీఎం కేసీఆర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సురభి వాణీదేవికే పట్టం    

ఘన విజయాన్నిచ్చిన పట్టభద్రులు

కౌంటింగ్‌ మొదటి నుంచి చివరిదాకా.. ముందుకే సాగిన సురభి.. 

హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో తొలిసారి గులాబీ జెండా ఎగిరింది. శాసన మండలి రద్దు అయి, పునరుద్ధరించిన తర్వాత ఈ నియోజకవర్గానికి జరిగిన నాలుగో ఎన్నిక ఇది. 2007, 2009లలో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ (స్వతంత్ర), 2015లో ఎం. రాంచందర్‌రావు (బీజేపీ) గెలిచారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలి.. ఘన విజయంతో సిటీలో కమలం పార్టీ దూకుడు మీద ఉన్న తరుణంలో.. దాని సిటింగ్‌ ఎమ్మెల్సీ స్థానంలోకి కారు దూసుకెళ్లడం ఒక రాజకీయ విశేషం. రాజకీయాలలోకి రావడం, ఎన్నికలలో పోటీ చేయడం.. అన్నీ తొలిసారే అయినా వాణీదేవి ఇద్దరు యోధులను  ఓడించడం మరో విశేషం. ఆమె అభ్యర్థిత్వం ప్రకటించే ముందు రోజు దాకా.. అసలు టీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందా అనే ప్రశ్న. చేయదు అనే భావన సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. అలాంటి వాతావరణం నుంచి ఈ రోజు ఫలితాల ప్రకటన దాకా.. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్‌ పరిణామాలు జాతీయ స్థాయిలో కూడా  ఆసక్తి రేకెత్తించాయి. 

Updated Date - 2021-03-21T06:40:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising