ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖకు పెద్దపీట: మంత్రి Satyavati

ABN, First Publish Date - 2021-11-15T17:09:27+05:30

రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.  అనారోగ్యంతో బాధపడుతున్న శిశువిహార్ పిల్లల కోసం ప్రత్యేకంగా  నిలోఫర్ ఆసుపత్రిలో వార్డ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి నగరం నలువైపులా సీఎం కేసీఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించనున్నారని చెప్పారు. పెద్ద ఎత్తున్న మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. వైద్య ఆరోగ్య శాఖ బలోపేతం కోసం కేసీఆర్ రూ.10 వేల కోట్లను ఖర్చు పెట్టనున్నారని తెలిపారు. కోవిడ్‌లో వైద్యులు ప్రాణాలకు తెగించి పని చేశారని... ఇక ముందు కూడా అలాగే పని చేయాలన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నందుకు గిరిజన బిడ్డగా గర్వపడుతున్నానని మంత్రి సత్యవతి పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-15T17:09:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising