ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణను బద్నాం చేయడం పద్ధతి కాదు: Niranjan

ABN, First Publish Date - 2021-11-18T17:49:54+05:30

వరి ధాన్యం కొంటారో లేదో కేంద్రం స్పష్టం చేయాలని...రాష్ట్రాన్ని బద్నాం చేయడం మంచి పద్ధతి కాదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వరి ధాన్యం కొంటారో లేదో కేంద్రం స్పష్టం చేయాలని...తెలంగాణ రాష్ట్రాన్ని బద్నాం చేయడం మంచి పద్ధతి కాదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ మహాధర్నాలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ కేంద్ర అస్పష్ట విధానంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర బీజేపీ నేతలు తలా తోక లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం తన ధర్మాన్ని నిర్వర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారన్నారు. షరతులు పెట్టి.. పోయిన యాసంగి ధాన్యం కొన్నారని తెలిపారు. బీజేపీ తొండి మాటలు బంద్ చేయాలని అన్నారు. కరోనా టైంలో అన్నీ బంద్ అయినా రైతులు పంట పండించడం బంద్ కాలేదని చెప్పారు. మనోవేదనతో సీఎం ధర్నాకు కూర్చున్నారన్నారు. కేంద్రం మనసు మార్చుకోకపోతే పతనం తప్పదని మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2021-11-18T17:49:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising