ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనూలో వర్క్‌షాపు ప్రారంభం

ABN, First Publish Date - 2021-04-12T06:56:42+05:30

గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీలో పరిశోధన పండితుల కోసం ఐదురోజుల పాటు ఆన్‌లైన్‌ వర్క్‌షాపును

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయదుర్గం, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీలో పరిశోధన పండితుల కోసం ఐదురోజుల పాటు ఆన్‌లైన్‌ వర్క్‌షాపును ఆదివారం ప్రారంభించారు. ది సెంటర్‌ ఫర్‌ ప్రొఫెషనల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ ఉర్దూ మీడియం టీచర్‌, ది ఆఫీస్‌ ఆఫ్‌ డీన్‌ రిసెర్చ్‌ అండ్‌ కన్సల్‌టెన్సీ ఆఫ్‌ మనూ, తెలంగాణ స్ట్టేట్‌ ఉర్దూ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వర్క్‌షాపును మనూ ఇన్‌చార్జి వైస్‌ చాన్సులర్‌ ప్రొఫెసర్‌ రెహ్మతుల్లా ప్రారంభించారు. రిసెర్చ్‌ మెథడాలజీ అండ్‌ ఐసీటీ టూల్స్‌ పేరుతో నిర్వహించిన ఈ వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. సాంఘిక అభివృద్ధికి పరిశోధనలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. టీఎస్‌యూఏ డైరెక్టర్‌, సెక్రెటరీ డాక్టర్‌ ఎండీ గౌస్‌ మాట్లాడుతూ పరిశోధకులు సమాజాభివృద్ధికి ముందస్తు ప్రణాళికలపై అధ్యాయనం చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ జహంగీర్‌ హుస్సెన్‌, రిసెర్చ్‌ అండ్‌ కన్సల్‌టెన్సీ డీన్‌ ప్రొఫెసర్‌ సల్మా హమీద్‌ ఫారూకి, ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-12T06:56:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising