ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబోయ్‌ జరిమానాలు

ABN, First Publish Date - 2021-03-02T06:52:23+05:30

రవాణా శాఖ అధికారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 క్యాబ్‌ డ్రైవర్ల ఆందోళన

హైదరాబాద్‌ సిటీ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా, రవాణా శాఖ అధికారులు నిబంధనల పేరిట జరిమానాలు వసూలు చేస్తుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కరోనా, లాక్‌డౌన్‌ కాలంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ల రెన్యూవల్‌కు కేంద్ర ప్రభు త్వం గడువు ఇచ్చింది. గతేడాది ఫిబ్రవరి 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 లోపు లైసెన్సులు, రిజిస్ట్రేషన్‌ రెన్యూవల్‌కు వెసులుబాటు కల్పించింది. అయితే, అప్పటి పరిస్థితులతో పాటు, లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో చాలా మంది రెన్యూవల్‌ చేయించుకోలేదు. అలాంటి వారంతా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చినా, లేట్‌ ఫీజులు, జరిమానా(డ్రైవింగ్‌ లైసెన్స్‌కు రూ. 1,000) చెల్లించాల్సిందేనని రవాణా శాఖ అధికారులు చెబుతూ, ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కరోనా, లాక్‌డౌన్‌ వల్ల ఆర్థికంగా దెబ్బతిన్నామని, రవాణా శాఖ అధికారులు జరిమానా విధించడంతో భరిం చలేకపోతున్నామని క్యాబ్‌ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చినా, జరిమానాలు వసూలు చేయవద్దనే నిబంధన లేదని జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ రమేశ్‌ తెలిపారు.

లైసెన్సులకు డిమాండ్‌

మరోవైపు డ్రైవింగ్‌ లైసెన్స్‌కు విపరీతమైన డిమాండ్‌ పెరుగుతోంది. దీనిపై జేటీసీ రమేశ్‌ను సంప్రదించగా, ఏటా అభ్యర్థుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. ఆ మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  


Updated Date - 2021-03-02T06:52:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising