ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సముద్రాల శ్రీనివాసాచార్యులుకు కలాం బెస్ట్ టీచర్ అవార్డ్

ABN, First Publish Date - 2021-10-25T02:25:14+05:30

హైదరాబాద్: నిజామాబాద్ శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్ టీచర్ సముద్రాల శ్రీనివాసాచార్యులుకు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నిజామాబాద్ శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్ టీచర్ సముద్రాల శ్రీనివాసాచార్యులుకు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ లీడ్ ఇండియా ఫౌండేషన్ హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆయనకు కలాం బెస్ట్ టీచర్ అవార్డ్‌ అందించింది. నిజామాబాద్‌లో శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్ ద్వారా అందించిన విద్యా సేవకు గాను ఆయనకు ఈ గుర్తింపు లభించింది. శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్ స్థాపించి ఆయన రెండున్నర దశాబ్దాలుగా వేలాది మంది విద్యార్ధులను తీర్చిదిద్దారు. తన సోదరులు, కుటుంబ సభ్యుల సహకారంతో ఆయన ఎందరో పేద విద్యార్ధులకు ఉచిత విద్య అందించారు. విద్యార్ధులు తమ జీవితాల్లో స్థిరపడేలా సహకరించారు. శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, శారద మాత బోధనలతో ఎందరో విద్యార్ధులకు మార్గనిర్దేశనం చేశారు. శ్రీనివాసాచార్యులుకు కలాం బెస్ట్ టీచర్ అవార్డ్ రావడంతో సముద్రాల కుటుంబ సభ్యులతో పాటు శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. కలాం బెస్ట్ టీచర్ అవార్డ్ రావడం ద్వారా తమపై మరింత బాధ్యత పెరిగిందని శ్రీనివాసాచార్యులు చెప్పారు. మరింత అంకితభావంతో పేద విద్యార్ధులకోసం పనిచేస్తామని శ్రీనివాసాచార్యులు చెప్పారు.

Updated Date - 2021-10-25T02:25:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising