ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృషి భారతాన్ని అభినందించిన కలెక్టర్.. వ్యవస్థాపకుడు కౌటిల్యకు సత్కారం

ABN, First Publish Date - 2021-04-11T03:34:09+05:30

వేద వ్యవసాయ ప్రయోగాలతో మరో విజయం సాధించిన కృషి భారతాన్ని కరీంనగర్ కలెక్టర్ శశాంక్ అభినందించారు. కరీంనగర్ జిల్లా ఖాసింపేట గ్రామంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: వేద వ్యవసాయ ప్రయోగాలతో మరో విజయం సాధించిన కృషి భారతాన్ని కరీంనగర్ కలెక్టర్ శశాంక్ అభినందించారు. కరీంనగర్ జిల్లా ఖాసింపేట గ్రామంలో 3 ఎకరాల పొలంలో కృష్ణ వ్రీహీ(నల్ల బియ్యం) పండించడంలో కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ విజయవంతమయ్యారు. ఈ క్రమంలోనే ఆ జిల్లా కలెక్టర్ శశాంక్.. కౌటిల్య కృష్ణన్‌ను సత్కరించారు. పొలం మొత్తం పర్యటించి పంటను పరిశీలించారు. మిగతా రైతులకు కూడా కౌటిల్య ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు.


అనంతరం కౌటిల్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో రైతులు అనాదిగా అనుసరించే మండి కట్టే పద్ధతితో పాటు వేద వ్యవసాయ పద్ధతులు పాటించామని తెలిపారు. డిసెంబర్లో విత్తనం వేశామని, ప్రస్తుతం వంద శాతం పంట వచ్చిందని కౌటిల్య తెలిపారు. వేద వ్యవసాయంలో భాగంగా పాలు, తేనెతో పాటు అగ్నిహోత్ర భస్మం కూడా వాడినట్లు చెప్పారు. ఆవుపేడను ఎరువుగా వాడినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో వేద వ్యవసాయం ద్వారా ఆరోగ్యమైన పంట పండిందని కౌటిల్య వెల్లడించారు.

Updated Date - 2021-04-11T03:34:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising