ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో ఒమైక్రాన్ వేరియంట్‌ టెన్షన్‌.. మహిళకు పాజిటివ్‌ వచ్చినట్లు అనుమానం..

ABN, First Publish Date - 2021-12-02T20:22:17+05:30

హైదరాబాద్: తెలంగాణలో ఒమైక్రాన్ వేరియంట్‌ టెన్షన్‌ మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో ఒమైక్రాన్ వేరియంట్‌ టెన్షన్‌ మొదలైంది. బ్రిటన్‌ నుంచి వచ్చిన ఓ మహిళకు ఒమైక్రాన్ పాజిటివ్‌ వచ్చినట్లు తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె నుంచి శాంపిల్స్‌ సేకరించిన అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. అలాగే ఆ మహిళను టిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. బుధవారం విదేశాల నుంచి వచ్చిన 320 మందికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు.


తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఒమైక్రాన్ ఎప్పుడైనా దేశంలోకి రావచ్చునని అన్నారు. నిన్న బ్రిటన్‌ నుంచి వచ్చిన ఓ మహిళకు పాజిటివ్‌ వచ్చిందన్నారు. ఆమెను టిమ్స్‌లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఒమైక్రాన్ వేరియంట్‌ 25 దేశాలకు వ్యాపించిందన్నారు. టీకాల వల్లే ఆస్పత్రుల్లో చేరే ముప్పు తప్పించుకోవచ్చునన్నారు. వ్యాక్సిన్‌ ద్వారా ప్రాణాపాయం జరగకుండా కాపాడుకోవచ్చునని అన్నారు. డెల్టా కంటే ఒమైక్రాన్ ఆరు రెట్లు వేగంగా విస్తరిస్తోందన్నారు. టీకా తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వానికి అందిస్తామన్నారు. కొవిడ్‌ నిబంధన ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-12-02T20:22:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising