ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

ABN, First Publish Date - 2021-10-26T14:59:26+05:30

నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ప్రియుడు కోటి రెడ్డి తన ప్రియురాలిని నమ్మించి లాడ్జ్‌కి తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని చందానగర్  పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.  ప్రియుడు కోటి రెడ్డి తన ప్రియురాలిని నమ్మించి లాడ్జ్‌కి తీసుకెళ్లి కిరాతకంగా హత్య  చేశాడు. ఒంగోలుకు చెందిన నాగ చైతన్యతో కోటి రెడ్డి ప్రేమ వ్యవహారం నడిపాడు. నాగ చైతన్య ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్స్‌గా పని చేస్తుండగా...కోటిరెడ్డి మెడికల్ రెప్రజెంటేటివ్‌గా చేస్తున్నాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించరని ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని కోటి రెడ్డి చెబుతున్నాడు. కాగా కోటిరెడ్డి ప్రియరాలిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రియురాలను హత్య చేసిన తరువాత లాడ్జ్ నుండి అదృశ్యమైన కోటిరెడ్డి... ఒంటి నిండా గాయాలతో ఒంగోలులోని ఓ హాస్పిటల్‌లో చేరాడు. ఒంగోలులో చికిత్స పొందుతున్న కోటి రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-10-26T14:59:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising