పెళ్లై ముగ్గురు పిల్లలు..ఆన్లైన్ చాటింగ్‌తో ప్రేమ.. భర్త అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసి ఏం చేసిందంటే..
ABN, First Publish Date - 2021-09-29T15:45:59+05:30
ప్రియుడి మోజులో భర్తను కిడ్నాప్ చేయించి బలవంతంగా విడాకుల పత్రంపై సంతకం చేయించుకున్న భార్యను మార్కెట్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు...
ప్రియుడి మోజులో భర్తను కిడ్నాప్ చేయించిన భార్య
విడాకుల పత్రంపై సంతకం
హైదరాబాద్/రెజిమెంటల్‌బజార్: ప్రియుడి మోజులో భర్తను కిడ్నాప్ చేయించి బలవంతంగా విడాకుల పత్రంపై సంతకం చేయించుకున్న భార్యను మార్కెట్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దీనికి సంబందించిన వివరాలను ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు వెల్లడించారు. మౌలాలి ఆర్టీసీ కాలనీకి చెందిన ఒకరు 2012లో మెహిదీపట్నంకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. అతను సికింద్రాబాద్‌లోని ఓ చెప్పుల దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఆమెకు ఆన్‌లైన్‌లో చాటింగ్ ద్వారా ముషీరాబాద్‌లో ఉంటూ క్యాటరింగ్ పనిచేసే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడికీ భార్య, పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య వివాహేతర సంబందం ఏర్పడింది.
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఆచూకీ తెలుసుకున్న పోలీసులు భర్తకు అప్పగించారు. అప్పటి నుంచి అతను భార్యను కట్టడి చేశాడు. తీరు మారని ఆమె ప్రియుడితో కలిసి భర్త కిడ్నా్‌పనకు ప్లాన్ చేసింది. నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై సోమవారం దుకాణం వద్దకు వచ్చి భర్తను బలవంతంగా ఎక్కించుకొని ముషీరాబాద్‌లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న భార్య, ప్రియుడు, కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన వారు కలిసి భర్తను బెదిరించి విడాకుల పత్రంపై సంతకం పెట్టించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెతోపాటు ఇద్దరిని అరెస్టు చేశారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Updated Date - 2021-09-29T15:45:59+05:30 IST