ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad లో నేరాలకు అడ్డాలుగా శివారులు.. నిఘా.. నై..!

ABN, First Publish Date - 2021-11-24T16:16:47+05:30

నేరగాళ్లు నగర శివారు ప్రాంతాలను అడ్డాగా మార్చుకుంటున్నారు. నిర్మానుష్య...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వినిపించని సైరన్‌.. కనిపించని పెట్రోలింగ్‌
  • రెచ్చిపోతున్న నేరగాళ్లు

- అంబర్‌పేట ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధి కొహెడ గ్రామం సబ్‌రోడ్డులోని కాలువలో  ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు ఇటీవల గుర్తించారు.

- అంతకముందు పహాడీషరీఫ్‌ పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో ఎక్కడో హత్య చేసిన మృతదేహాన్ని రోడ్డుపక్కన కాల్చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 

- హయత్‌నగర్‌ పరిధి కుంట్లూరు శివారు ప్రాంతంలో కారులోనే ఓ వ్యక్తిని హత్య చేశారు. 

- రాజేంద్రనగర్‌ పరిధిలో ఓ మహిళను ముగ్గురు ఆటోలో ఎక్కించుకొని హిమాయత్‌సాగర్‌ వైపు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.

- హిమాయత్‌సాగర్‌ చెరువు కట్టపై ఓ మహిళను దుండగులు చంపేసి వెళ్లిపోయారు. 

- ఇలా చెప్పుకుంటూ పోతే శివార్లలో జరుగుతున్న నేరాలు-ఘోరాలు ఎన్నో..


హైదరాబాద్‌ సిటీ : నేరగాళ్లు నగర శివారు ప్రాంతాలను అడ్డాగా మార్చుకుంటున్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో కొందరు దుండగులు ఇష్టానుసారంగా మద్యం తాగి మృగాళ్లుగా మారుతున్నారు. ఒంటరి మహిళలను, ఇతర ప్రాంతాల నుంచి ఎత్తుకొచ్చిన మహిళలను చెరబడుతున్నారు. విషయం బయటకు పొక్కుతుందని కొందరు చంపేసి పెట్రోల్‌, డీజిల్‌, కిరోసిన్‌ పోసి మృతదేహాలను కాల్చేస్తున్నారు. పారిపోవడానికి నగరం నలువైపులా జాతీయ రహదారులు అందుబాటులో ఉండటం నేరస్థులకు శివారు ప్రాంతాలు బాగా కలిసి వస్తున్నట్లు భావిస్తున్నారు. నగరం చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన కొందరు ఘరానా నేరగాళ్లు మహిళలు, పురుషులను వేరోచోట హత్యచేసి వాహనాల్లో తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.


గస్తీ ఎక్కడ..? 

ట్రై కమిషనరేట్‌ పరిధి శివారు ప్రాంతాల్లో అర్ధరాత్రి పోలీసుల గస్తీ కనిపించడంలేని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెట్రోలింగ్‌ పోలీసులు శివారు కాలనీల్లో తిరగడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. పోలీసుల సైరన్‌ వినిపించడంలేదని, గస్తీ వాహనాలు కనిపించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున  4 గంటల మధ్యలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గస్తీ లేకపోవడమే ఇందుకు కారణమని పలువురు పేర్కొంటున్నారు. హత్యలు, మృతదేహాలు వంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు లా  అండ్‌ ఆర్డర్‌ పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. 



Updated Date - 2021-11-24T16:16:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising