ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి ఇంట హిజ్రాల హంగామా.. ఒకరి అరెస్టు

ABN, First Publish Date - 2021-06-18T16:36:03+05:30

పెళ్లి వేడుకల్లో హిజ్రాలు హంగా మా చేయడంతో ఒకరిని నేరేడ్‌మెట్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 14న పాత నేరేడ్‌మెట్‌ వినాయకనగర్‌లో చింతల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హైదరాబాద్/నేరేడ్‌మెట్‌: పెళ్లి వేడుకల్లో హిజ్రాలు హంగా మా  చేయడంతో ఒకరిని నేరేడ్‌మెట్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 14న పాత నేరేడ్‌మెట్‌ వినాయకనగర్‌లో చింతల స్వరూప(45) కుమారుడి పెళ్లి వేడుక జరిగింది. కందిగూడకు చెందిన మోక్ష(21), తమన్నా(22) అనే ఇద్దరు హిజ్రాలు ఆమె ఇంటికి వెళ్లి తాము దీవించాలంటే రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెళ్లి అయిన తర్వాత ఇస్తానని చెప్పి స్వరూప వారిని పంపించారు. ఈనెల 16న పెళ్లికి చెందిన రెండో వేడుక జరుగుతుండగా హిజ్రాలు మళ్లీ వెళ్లారు. వారికి స్వరూప రూ. మూడు వేలు ఇచ్చి పంపించారు. సాయంత్రం మరో హిజ్రా సోనీతో కలిసి వచ్చిన ముగ్గురు హిజ్రాలు రూ. 50 వేలు ఇవ్వాలని పట్టుబడి నానా హంగామా చేశారు. అసభ్యంగా ప్రవర్తిస్తూ బంధువులను దుర్భాషలాడి, ఇంట్లోని సామగ్రి ధ్వంసం చేశారు. స్వరూప ఫిర్యాదు మేరకు నేరేడ్‌మెట్‌ పోలీసులు మోక్ష అనే హిజ్రాను అరెస్టు చేశారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నామని సీఐ నరసింహస్వామి తెలిపారు. 

Updated Date - 2021-06-18T16:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising