ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యూఆర్‌ కోడ్‌ పంపి లక్షల్లో..

ABN, First Publish Date - 2021-06-18T17:36:15+05:30

మెటీరియల్‌ కొనుగోలు పేరుతో క్యూఆర్‌ కోడ్‌ పంపించి ఓ వ్యాపారిని మాయచేసిన సైబర్‌ కేటుగాళ్లు రెండున్నర లక్షలకు పైగా కాజేశారు. గంగాధర్‌రెడ్డి అనే వ్యక్తి తార్నాకలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌: మెటీరియల్‌ కొనుగోలు పేరుతో క్యూఆర్‌ కోడ్‌ పంపించి ఓ వ్యాపారిని మాయచేసిన సైబర్‌ కేటుగాళ్లు రెండున్నర లక్షలకు పైగా కాజేశారు. గంగాధర్‌రెడ్డి అనే వ్యక్తి తార్నాకలో ఎస్వీఆర్‌ టెక్నాలజీ పేరుతో మెటీరియల్‌ బిజినెస్‌ నిర్వహిస్తున్నారు. బుధవారం అతనికి ఓ వ్యక్తి కాల్‌ చేసి తనకు వైరల్‌ ట్రాన్స్‌పోర్టు మీడియా మెటీరియల్‌ మూడువందల పీసెస్‌ కావలంటూ ఆర్డర్‌ పెట్టాడు. ఇందుకు సంబంధించిన డబ్బులు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లిస్తానని, మీ మొబైల్‌కు వచ్చిన క్యూఆర్‌ కోడ్‌ను క్లిక్‌ చేసి కన్‌ఫర్మ్‌ చేస్తే డబ్బు పంపించడం సులువవుతుందని నమ్మించాడు. అతడు చెప్పినట్లే గంగాధర్‌రెడ్డి మొబైల్‌ ఫోన్‌కు వచ్చిన క్యూఆర్‌ కోడ్‌ క్లిక్‌ చేశాడు. ఆ వెంటనే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.2.70లక్షలు డెబిట్‌ అయ్యాయి. ఆ తర్వాత తనకు వచ్చిన ఫోన్‌ నెంబర్‌కు కాల్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో బాధితుడు సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-06-18T17:36:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising