ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17మంది ఆటో డైవ్రర్ల ఆర్సీలు అడ్డం పెట్టుకుని జల్సాలు

ABN, First Publish Date - 2021-05-05T17:44:27+05:30

ఆటోల ఆర్సీలు అడ్డం పెట్టుకుని లక్షల రూపాయలు దండుకున్నాడు. తాను పని చేస్తున్న సంస్థకు కొర్రి పెట్టాడు ఓ వ్యక్తి. ఆర్సీలు ఏమయ్యాయని యజమాని అడుగుతున్న ప్రతి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్సీలు తాకట్టు పెట్టి లక్షలు గోల్‌మాల్‌ 

కొన్న వాళ్లకు ట్రాన్స్‌ఫర్‌ చెయ్యకుండా కాలయాపన.. 

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌: ఆటోల ఆర్సీలు అడ్డం పెట్టుకుని లక్షల రూపాయలు దండుకున్నాడు. తాను పని చేస్తున్న సంస్థకు కొర్రి పెట్టాడు ఓ వ్యక్తి. ఆర్సీలు ఏమయ్యాయని యజమాని అడుగుతున్న ప్రతి సందర్భంలో ఆర్టీఏ కార్యాలయంలో ఉన్నాయంటూ మాయమాటలు చెప్పాడు. చివరికి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... హిమాయత్‌నగర్‌కు చెందిన హష్ముక్‌ మోటార్స్‌లో మీర్జా అక్రమ్‌ బేగ్‌ డీల్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. పాత ఆటోలను ఈ మోటార్స్‌ వాళ్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. వీళ్ల మోటార్స్‌ వద్ద ఈ ఆటోలను కొనుగోలు చేసిన వ్యక్తులకు ఆ ఆర్సీలను ట్రాన్స్‌ఫర్‌ చెయ్యాల్సి ఉంటుంది. కానీ..అక్రమ్‌ బేగ్‌ వాటిని  వేరే వాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నాడు. ఇలా ఇప్పటివరకు 17ఆర్సీలు తాకట్టు పెట్టి సుమారు రూ.10 లక్షలకు పైగా వారి నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బును సొంత ఖర్చులకు, జల్సాలకు వాడుకున్నాడు. మోటార్స్‌ వద్ద ఆటోలు కొనుగోలు చేసిన వారు తమకు ఆర్సీలు ఇవ్వండంటూ హిమాయత్‌నగర్‌లోని కార్యాలయానికి వస్తున్నారు. ఈ విషయంపై మోటార్స్‌ యజమాని కల్పేష్‌ జైన్‌ అక్రమ్‌ బేగ్‌ని పలుమార్లు అడిగాడు. ఆర్సీలు అన్నీ ఆర్టీఏ కార్యాలయంలో ఉన్నాయంటూ కాలయాపన చేశాడు. ఆర్టీఏ కార్యాలయంలో వీటి గురించి విచారించగా తమ వద్ద ఆర్సీలు ఏవీ రాలేదని బదులిచ్చారు. దీంతో యజమాని కల్పేష్‌ జైన్‌ మంగళవారం రాత్రి నారాయణ గూడ పోలీసులును ఆశ్రయించారు. అక్రమ్‌ బేగ్‌ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చందర్‌ సింగ్‌ తెలిపారు. బేగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-05-05T17:44:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising