ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: జీవో 111పై హైకోర్టులో విచారణ వాయిదా

ABN, First Publish Date - 2021-08-26T18:27:53+05:30

జీవో నెంబర్ 111పై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జీవో నెంబర్ 111పై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. గురువారం జీవోనెంబర్ 111పై హైకోర్టులో విచారణ జరుగగా...ప్రభుత్వ తీరుపై అసహనాన్ని వెలిబుచ్చింది. నివేదిక జాప్యం వెనక రహస్య ఎజెండా ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. విచారణ నాలుగేళ్లు దాటినా ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వడం లేదని అడిగింది. కరోనా, తదితర కారణాల వల్ల ఆలస్యమైందని  అదనపు ఏజీ రామచంద్రరావు కోర్టుకు వివరించారు. దీంతో ఉన్నత స్థాయి కమిటీ సెప్టెంబర్ 13లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. నివేదిక సమర్పించకపోతే ఆ రోజుతో కమిటీ రద్దు చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈపీటీఆర్ఐ నివేదికపై కూడా అభిప్రాయాలను తెలపాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే నివేదికను వెబ్ సైట్‌లో పెట్టాలని కమిటీకి తెలిపింది. కమిటీ నివేదికపై సెప్టెంబర్ నెలాఖరు నాటికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూ...తదుపరి విచారణ అక్టోబరు 4కు వాయిదా వేసింది. 

Updated Date - 2021-08-26T18:27:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising