ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: అయ్యయ్యో వద్దమ్మా..

ABN, First Publish Date - 2021-10-13T15:23:17+05:30

ఉచిత తాగునీటి పథకంలో చేరిన లబ్ధిదారులు ఇప్పటికే చెల్లించిన నీటి బిల్లులను తిరిగి ఇచ్చేందుకు వాటర్‌బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మే నుంచి ఆగస్టు 15 మధ్యలో నెలకు ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెల్లించిన నీటి బిల్లులు వాపస్‌..?

ఉచిత నీటి లబ్ధిదారులకు తిరిగి ఇవ్వనున్న బోర్డు

ప్రభుత్వ అనుమతికి ఎదురుచూపులు


హైదరాబాద్‌ సిటీ: ఉచిత తాగునీటి పథకంలో చేరిన లబ్ధిదారులు ఇప్పటికే చెల్లించిన నీటి బిల్లులను తిరిగి ఇచ్చేందుకు వాటర్‌బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మే నుంచి ఆగస్టు 15 మధ్యలో నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకంలో చేరిన లబ్ధిదారుల్లో అత్యధికులు అప్పటికే నీటి బిల్లులు చెల్లించారు. వారంతా నీటి బిల్లుల డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ అంశాన్ని వాటర్‌బోర్డు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే బిల్లుల రుసుం వినియోగదారులకు తిరిగి ఇచ్చే అవకాశాలున్నాయి.


గ్రేటర్‌లో డిసెంబర్‌ నుంచి ఉచిత తాగునీటి పథకం అమలవుతోంది. ఈ పథకంలో చేరేందుకు చివరి గడువు ఏప్రిల్‌ 30తో ముగిశాక నగరంలోని గృహ కనెక్షన్లకు మే, జూన్‌ నెలలో ఒకేసారి ఐదారు నెలల నీటి బిల్లులు జారీ చేశారు. దీంతో చాలా మంది బిల్లులు చెల్లించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ పథకంలో చేరేందుకు మరోసారి అవకాశం కల్పించింది. ఆగస్టు 15 నాటికి పథకంలో చేరిన వారికి తొమ్మిది నెలలకు బిల్లులో రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. రెండో విడతలో లబ్ధిదారులుగా చేరినవారు అప్పటికే చెల్లించిన నీటి బిల్లుల రుసుంను తిరిగి చెల్లించాలని కోరుతుండడంతో వాటర్‌బోర్డు అధికారులు పరిశీలిస్తున్నారు.

Updated Date - 2021-10-13T15:23:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising