ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌ ఉన్నా సిరంజిలు కరువు

ABN, First Publish Date - 2021-06-18T13:31:03+05:30

ఎంతో కీలకమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో కొన్నిచోట్ల విమర్శల పాలవుతోంది. చందానగర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో వ్యాక్సిన్‌ ఉన్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చందానగర్‌లో నిరీక్షణ

హైదరాబాద్/చందానగర్‌: ఎంతో కీలకమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో కొన్నిచోట్ల విమర్శల పాలవుతోంది. చందానగర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో వ్యాక్సిన్‌ ఉన్నా, సిరంజిలు లేక రెండు గంటల పాటు సుమారు 1000 మంది వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. చందానగర్‌ సర్కిల్‌ పరిధిలో రెండు వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రోజూ వేల సంఖ్యలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ప్రజలు తరలివస్తున్నారు. అంతంత మాత్రంగానే వసతులు ఉండడంతో వ్యాక్సినేషన్‌ చురుగ్గా సాగడం లేదు. పీజేఆర్‌ స్టేడియంలో ఓపెన్‌గా కౌంటర్లను ఏర్పాటు చేసి టెంట్‌లు ఏర్పాటు చేశారు. గురువారం అక్కడి నుంచి కార్యాలయంలోకి కౌంటర్లు మార్చడంతో ప్రజలు ఎండలో నిలబడాల్సి వచ్చింది. స్టేడియం నుంచి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వరకు సుమారుగా అర కిలోమీటర మేర మహిళలు క్యూలో నిలుచున్నారు. వారిలో కొందరు పసిబిడ్డలను ఎత్తుకుని ఇబ్బందుల పాలయ్యారు. కౌంటర్లు ఏర్పాటు చేసిన హాల్‌లోనే మరుగుదొడ్లు ఉండటంతో ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం తాగునీటి వసతి కూడా కేంద్రంలో ఏర్పాటు చేయలేదు. అంబేడ్కర్‌ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో సిరంజిలు కొరత ఉండడంతో 2 గంటల పాటు వ్యాక్సినేషన్‌ నిలిచిపోయింది.

Updated Date - 2021-06-18T13:31:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising